ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రముఖ నటుడు కృష్ణంరాజుకి ఆపరేషన్

cinema |  Suryaa Desk  | Published : Tue, Mar 08, 2022, 02:57 PM

ప్రముఖ నటుడు, నిర్మాత కృష్ణంరాజుకి ఆపరేషన్ జరిగింది. ఇటీవల ఆయన కాలుజారి పడ్డారు. దాంతో చిన్న సర్జరీ అవసరమైంది. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో సర్జరీ పూర్తయ్యింది.ఆయన డిశ్చార్జీ కూడా ఆయ్యారు. సర్జరీలో భాగంగా ఆయన కాలి వేలుని తొలగించాల్సివచ్చిందని సమాచారం. ప్రస్తుతం కృష్ణంరాజు క్షేమంగా ఉన్నారు. ఆయన నిర్మాణంలో `రాధే శ్యామ్‌` తెరకెక్కిన సంగతి తెలిసిందే.ఇందులో ఆయన ఓ కీలక పాత్ర కూడా పోషించారు. ఈనెల 11న రాధే శ్యామ్ విడుదల అవుతోంది. ఈ సినిమా ప్రమోషన్లలో తాను కూడా పాల్గొనాలని కృష్ణంరాజు భావించారు. కానీ. ఆరోగ్యం సహకరించలేదు. సినిమా విడుదలైన తరవాత ఆయన మీడియా ముందుకొచ్చే అవకాశం ఉంది.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa