ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహిళా దినోత్సవాన హ్యాపీ ఫూల్స్ డే అంటూ అనసూయ ట్వీట్

cinema |  Suryaa Desk  | Published : Tue, Mar 08, 2022, 02:57 PM

మార్చి 8 -  అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈ రోజుని పురస్కరించుకుని సినీ ప్రముఖులు, అభిమానులనే తేడా లేకుండా వారి వారి మాతృమూర్తులకు, అక్కలకు, చెల్లెళ్లకు, జీవిత భాగస్వాములకు,బిడ్డలకు ఇలా తమ జీవితంలోముఖ్య పాత్ర పోషించే ఆడవారికి శుభాకాంక్షలు తెలియజేస్తారు. అయితే ఆశ్చర్యకరంగా యాంకర్ అనసూయ మాత్రం హ్యాపీ ఫూల్స్ డే అంటూ ట్వీట్ చేసింది. "ఓహో! ట్రోలర్లకు, మీమ్స్ క్రియేటర్స్ కు ఈ రోజు ఉమెన్స్ డే అని గుర్తుకొచ్చిందనుకుంటా అందుకే ఉన్నట్టుండి ఆడవాళ్ళకి గౌరవం ఇస్తున్నారు. కాకపోతే వారిచ్చే గౌరవం 24 గంటలలో ముగుస్తుంది. అందుకే మహిళలందరికీ హ్యాపీ ఫూల్స్ డే" అంటూ రాసుకొచ్చింది. ఈ పోస్ట్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతుంది. అనసూయ ట్వీట్ ను కొందరు అంగీకరిస్తుంటే, మరి కొంతమంది విమర్శిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa