బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరైనా సోనాక్షి సిన్హా తనపై వస్తున్న రూమర్లపై క్లారిటీ ఇచ్చింది. ఇటీవల సల్మాన్‌తో ఎంగేజ్‌మెంట్ అయిందనే విషయాన్ని ఖండించిన కొన్ని రోజులకే మరో రూమర్ షికారు చేసింది. ఇటీవల ఆమెపై చీటింగ్ కేసులో భాగంగా నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయిందనే వదంతులపై స్పందించింది. అవన్నీ అవాస్తవాలనీ, తనపై వచ్చిన కథనాలను నమ్మొద్దని అభిమానులకు సూచించింది. తాజాగా మంగళవారం దీనిపై ప్రకటన విడుదల చేసింది. తనపై కొందరు ఉద్దేశపూర్వకంగానే కల్పిత వార్తలు ప్రచారం చేస్తున్నారని మండిపడింది.
ఓ వ్యక్తి తనను వేధించేందుకు ఇదంతా చేస్తున్నాడని, మీడియా కూడా నిర్ధారణ చేసుకుని వాస్తవాలను ప్రసారం చేయాలని కోరింది. అసత్య వార్తలను ప్రచారం చేసే వారిని ప్రోత్సహించొద్దని తెలిపింది. ప్రస్తుతం ఆ కేసు మురాదాబాద్ కోర్టులో విచారణ సాగుతోందని, దానిపై అలహాబాద్ కోర్టు స్టే ఇచ్చిందని వెల్లడించింది. కోర్టు తీర్పు తర్వాత స్పందిస్తానని వివరించింది. ఓ ఈవెంట్ కోసం ప్రమోద్ శర్మ అనే వ్యక్తి సోనాక్షి సిన్హాను ముఖ్య అతిథిగా ఆహ్వానించాడు. అందుకు ఆమె డిమాండ్ చేసిన నగదును సోనాక్షికి అందజేశాడని, తీరా వేడుకకు ఆమె రాకపోవడంతో కోర్టులో కేసు వేశాడని తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa