మలయాళ మెగా స్టార్ మమ్ముట్టి,టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని తదుపరి సినిమా 'ఏజెంట్'లో కనిపించనున్నారు అని మేకర్స్ ప్రకటించారు.ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది.అమల్ నీరద్ దర్శకత్వంలో మమ్ముట్టి నటించిన 'భీష్మపర్వం' సినిమా భారీ హిట్ సాధించినందుకు టీమ్ 'ఏజెంట్' స్టార్ నటుడిని అభినందించారు.స్పై థ్రిల్లర్ ట్రాక్ లో వస్తున్న ఈ సినిమాలో అఖిల్ సరసన సాక్షి వైద్య నటిస్తుంది.ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్,సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర ఈ సినిమాని నిర్మిస్తున్నారు.సెన్సేషనల్ మ్యూజిక్ కంపోజర్ హిప్ హాప్ థామిజ సంగీతం అందిస్తున్నారు.జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్‌గా ఉండగా,అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు త్వరలో మేకర్స్ ప్రకటించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa