తమిళ స్టార్ హీరో అజిత్,హెచ్ వినోద్ దర్శకత్వంలో నటించిన 'వాలిమై' సినిమా వరల్డ్ వైడ్ గా పలు భాషల్లో రిలీజ్ అయ్యింది.ఈ చిత్రంలో టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ విలన్‌గా నటించగా,హ్యూమా ఖురేషి ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు.అయితే ఈ యాక్షన్ ప్యాక్డ్ మూవీ అనుకున్నట్టుగానే చెన్నైలో కలెక్షన్లు సాలిడ్ గా ఉన్నాయి.కానీ తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా పెద్దగా వసూలు రాబట్టలేదు.తాజాగా,అజిత్ దర్శకుడు హెచ్ వినోద్ అండ్ నిర్మాత బోనీ కపూర్‌తో కలిసి మరో సినిమా చేస్తున్నాడు.ఈ చిత్రం బ్యాంకు దోపిడీకి సంబంధించినదని,అజిత్ ఈ సినిమాలో నెగిటివ్ రోల్‌లో కనిపించనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.ప్రముఖ సౌత్ యాక్టర్ ఈ చిత్రంలో విలన్‌లలో ఒక్కరిగా కనిపించనున్నారు అని మేకర్స్ వెల్లడించారు.కొద్ది రోజుల క్రితం అజిత్ కొత్త లుక్ లో ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఈ సినిమాలో అజిత్ కొత్ లుక్ లో కనిపించనున్నాడు అని లేటెస్ట్ టాక్.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa