మన టాలీవుడ్ యంగ్ అండ్ స్టార్ హీరో విశ్వక్ సేన్ కి మాస్ లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే ఆయన సినిమాల్లో “ఫలక్ నామా దాస్” మంచి మాస్ సినిమాగా పేరు తెచ్చుకున్నాడు . ఇప్పుడు తన మార్క్ టైటిల్ తో తన లేటెస్ట్ ప్రాజెక్ట్ ని కూడా అనౌన్స్ చేశాడు. ఈ చిత్రానికి "దస్ కా ధమ్కీ" అనే మాస్ టైటిల్ ఫిక్స్ చేయగా, నరేష్ కుప్పిలి దర్శకత్వం వహిస్తుండగా ప్రసన్న కుమార్ బెజవాడ కథ, మాటలు అందిస్తున్నారు. ఈ సినిమాలో విశ్వక్ సరసన నివేదా పేతురాజ్ మరోసారి హీరోయిన్ గా నటిస్తుంది. మార్చి 14 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa