సురేష్ త్రివేణి దర్శకత్వంలో బాలీవుడ్ యాక్ట్రెస్ విద్యాబాలన్ నటిస్తున్న ‘జల్సా’ మూవీ మార్చి 18న డైరెక్ట్ అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానుంది.థ్రిల్లర్ జానర్లో వస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేయగా,'కల్పితం కంటే నిజం వింతైనది!' అని ఈ బ్యూటీ కాప్షన్ ఇచ్చింది.ఈ మూవీలో విద్యా ఒక జాతీయ మీడియా ఛానెల్‌కు ఎడిటర్‌గా నటిస్తుంది.ఒక యువతి ప్రమాదానికి గురి కాగా ,ఈ మర్డర్ విషయంలో పెద్ద వ్యక్తులుకి సంబంధం ఉన్నట్లుగా తెలుస్తుంది.విద్యా ఛానెల్లో పని చేస్తున్న యువ జర్నలిస్ట్ ఈ కేసును పరిశోధించాలని అనుకుంటుంది.విద్య ఈ కేసు గురించి మిస్టరీ షాకింగ్ వివరాలతో పాటు చాలా వాస్తవాలను తెలుసుకుంటుంది.దర్యాప్తును నిలిపివేయమని లేడీ జర్నలిస్ట్‌ను విద్య ఆదేశిస్తుంది.విద్యా ఇంట్లో పనిమనిషిగా కనిపించిన నటి షెఫాలీ షా కూడా ఈ మర్డర్ మిస్టరీతో ముడిపడి ఉన్న యువతి పాత్రను పోషించింది.ఈ ట్రైలర్ చాలా ఆసక్తికారంగా ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa