ఆశిష్ రెడ్డి, అనుపమ పరమేశ్వరన్ హీరో హీరోయిన్లుగా, శ్రీ హర్ష కోనుగంటి దర్శకత్వంలో వచ్చిన చిత్రం రౌడీ బాయ్స్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.
ఈ సినిమా 2022 జనవరిలో రిలీజ్ అయి మంచి విజయం సాధించింది. ఈ చిత్రంలోని పాటలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దీంతో ఈ సినిమాని ఓటిటిలో కూడా రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే.
ఈ రోజు అంటే శుక్రవారం,మార్చి 11న జీ5 లో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు జీ5 తెలుగు తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa