బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. హృతిక్, ఆయన మాజీ భార్య సుస్సన్నే ఖాన్ పరస్పర అంగీకారంతో 2014లో విడాకులు తీసుకున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ నటి సబా ఆజాద్ తో హృతిక్ కు పరిచయం ఏర్పడింది. దీంతో వీరు కొంతకాలంగా సన్నిహితంగా ఉంటున్నారు. గత కొన్నిరోజులుగా ముంబైలోని ప్రముఖ రెస్టారెంట్లకు డిన్నర్ డేట్స్‌కు వెళ్తున్నారు. వీరు కెమెరా కంట పడటంతో వీళ్లిద్దరూ రిలేషన్‌లో ఉన్నారంటూ ప్రచారం జరిగింది. అయితే తాజా సమాచారం ప్రకారం హృతిక్ - సబా త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే హృతిక్ రోషన్ తన కుటుంబ సభ్యులు, పిల్లలకు సబా ఆజాద్‌ని పరిచయం చేశారట. వాళ్లందరికీ ఆమె బాగా నచ్చిందట. కాగా హృతిక్ మాజీ భార్య సుస్సన్నేఖాన్ కూడా సబాకు మంచి ఫ్రెండ్ అని తెలిసింది. హృతిక్ కుటుంబంతో సబా కలిసి ఉన్న పలు ఫొటోలు ఇటీవల వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే వీళ్లిద్దరూ పెళ్లి చేసుకుంటున్నారనే వార్తలు వస్తున్నాయి.