సౌత్ ఇండియా టాప్ హీరోయిన్స్ లో మిల్కీ బ్యూటీ తమన్నా ఒక్కరు.ఈ బ్యూటీ క్వీన్ దర్శకుడు మధుర్ భండార్కర్‌తో 'బాబ్లీ బౌన్సర్' సినిమా చేయనున్న విషయం తెలిసిందే.ఫిబ్రవరిలో షూటింగ్ ప్రారంభించిన ఈ సినిమా ఇప్పుడు పంజాబ్‌లో తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది.'బాబ్లీ బౌన్సర్'మొదటి షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది అని ఈ గ్లామర్ క్వీన్ గురువారం రాత్రి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.ఈ చిత్రంలో సౌరభ్ శుక్లాతో పాటు అభిషేక్ బజాజ్ మరియు సాహిల్ వైద్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు త్వరలో మేకర్స్ వెల్లడి చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa