ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లహరి ఫిల్మ్స్ తొలి చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న స్టార్ హీరో

cinema |  Suryaa Desk  | Published : Fri, Mar 11, 2022, 04:41 PM

సౌత్ ఇండియన్ అతిపెద్ద సంగీత లేబుల్ 'లహరి మ్యూజిక్' ఇప్పుడు 'వీనస్ ఎంటర్‌టైనర్స్'తో కలిసి 'లహరి ఫిల్మ్స్ LLP' పేరుతో ఫిలింఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తుంది.హీరో ఉపేంద్ర తొలి ప్రాజెక్ట్‌కి  దర్శకత్వం వహించనున్నారు.ఉపేంద్ర గురించి సౌత్ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు.పాన్-ఇండియా స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమాకి ఇంకా మేకర్స్ టైటిల్ ని ఖరారు చేయలేదు.కన్నడ, హిందీ,తెలుగు అండ్ తమిళంలో కూడా ఈ సినిమా రిలీజ్ కానుంది.ఈ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేస్తూ మేకర్స్ పోస్టర్‌ను ఈరోజు విడుదల చేశాడు.ఉపేంద్ర నటిస్తున్న 'హోమ్ మినిస్టర్' సినిమా ఏప్రిల్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa