ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఎస్.ఎస్. రాజమౌళి, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తో ఒక సినిమా చేయనున్నారన్న విషయం తెలిసిందే.ప్రస్తుతం చిత్రసీమలో ఈ సినిమాకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త షికారు చేస్తుంది. అదేంటంటే మహేష్-రాజమౌళి సినిమాలో నందమూరి నట సింహం బాలకృష్ణ కూడా నటించనున్నారట. ఈ సినిమాలో బాలయ్య పాత్ర దాదాపు ఇరవై నిముషాల నిడివి ఉంటుందట. జక్కన్న దర్శకత్వంలో బాలయ్య అంతకుముందు ఒక సినిమాను మిస్ చేసుకున్నా ఈ సినిమాతో అది తీరిపోతుంది.
మహేష్-రాజమౌళి సినిమా అడ్వెంచర్ థ్రిల్లర్గా , ఆఫ్రికా నేపథ్యంలో ఉండనుందని ఇటీవల రచయిత విజయేంద్ర వర్మ తెలపడం తో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పుడు తాజాగా ఈ సినిమాలో బాలయ్య నటించబోతున్నట్లు తెలియటంతో ఆ అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ వార్తలో ఎంత వరకు నిజముందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకు వేచి ఉండాల్సిందే. ప్రస్తుతం రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ ప్రొమోషన్సులో, మహేష్ బాబు సర్కారు వారి పాట షూటింగులో బిజీగా ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa