మలైకా అరోరా... బాలీవుడ్ నటి. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్బాజ్ ఖాన్ మాజీ భార్య. పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమాలో 'కెవ్వుకేక' పాటతో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే. ప్రేమించి పెళ్లి చేసుకున్న అర్బాజ్,మలైకా జంట విభేదాల కారణంగా 2017లో విడాకులు తీసుకున్నారు. ఈ జంటకు అర్హాన్ ఖాన్ అనే కొడుకు ఉన్నాడు. ప్రస్తుతం మలైకా, కొడుకుతో కలిసి నివసిస్తోంది.
ఇప్పటివరకు తన విడాకుల గురించి మాట్లాడని మలైకా ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ "భయపడుతూనే నా జీవితంలో చాలా బోల్డ్ నిర్ణయం తీసుకున్నాను. సింగల్ మదర్ గా నా కొడుకుని సరిగా పెంచగలనా?,సమాజం నన్ను,నా కొడుకుని ఎలా రిసీవ్ చేసుకుంటుందో? అనే విపరీతమైన ఆలోచనలు నన్ను ఉక్కిరిబిక్కిరి చేసినా దైర్యంగా ముందడుగేశాను. ఇప్పుడు నేను సింగిల్ మదర్ ని.. అదే నన్ను బాధ్యతగా ఉండేలా చేస్తోంది. కొన్ని బోల్డ్ నిర్ణయాలు తీసుకొనేలా చేస్తుంది” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం మలైకాకు సంబంధించిన ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa