ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మరో పాన్ ఇండియా సినిమాను ప్రకటించిన ఉపేంద్ర.... ఫస్ట్ లుక్ రిలీజ్...

cinema |  Suryaa Desk  | Published : Sat, Mar 12, 2022, 11:36 AM

కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర వరసగా రెండు పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ కన్నడ చిత్రసీమని ఆశ్చర్య పరుస్తున్నారు. ఇప్పటికే 'కబ్జా'లో ఉపేంద్ర నటిస్తుండగా మరొకటి ఆయనే దర్శకత్వం వహిస్తున్న U. లహరి ఫిలింస్, LLP వీనస్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా  ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 


ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఉపేంద్ర  ఈ రోజు మధ్యాహ్నం ట్విట్టర్లో విడుదల చేశారు.  ప్రజా ప్రభు ఫాన్స్ కి ఈ సినిమాని అంకితం చేస్తున్నట్లు ఈ ట్వీట్లో పేర్కొన్నారు ఉపేంద్ర.  ఈ పోస్టర్లో కొమ్ములు తిరిగిన గుర్రంపై కూర్చుని ఉన్న ఉపేంద్ర చాలా  భయంకరంగా,ఒక రాక్షసుడిలా కనిపిస్తున్నారు. ఉపేంద్ర గారి సినిమాలు ఎలా ఉంటాయో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆయన డైరెక్షన్లో రాబోతున్న చిత్రం కావటంతో ప్రేక్షకుల్లో ఈ చిత్రం పట్ల ఆసక్తి నెలకొంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa