ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మెగా బ్రదర్ కొత్త లుక్కుకి కారణమేంటి?

cinema |  Suryaa Desk  | Published : Sat, Mar 12, 2022, 11:40 AM

మెగా ఫామిలీ హీరోలందరూ సినిమాలతో బిజీగా ఉంటే మెగా బ్రదర్ నాగబాబు మాత్రం బుల్లితెర మీద తీరిక లేకుండా గడుపుతారు. అప్పుడప్పుడు సినిమాల్లో కనిపిస్తారు. నాగబాబు చివరిగా నాగార్జున బంగార్రాజు సినిమాలో యముడిగా నటించారు. ఆ తర్వాత ఆయన కమిటైన సినిమాలేవీ లేవు. ప్రొడ్యూసర్గా కూడా ప్రస్తుతం ఏ సినిమాలు చెయ్యట్లేదు. బుల్లితెర మీద కూడా ఈ మధ్య అంతంత మాత్రంగానే కనిపిస్తున్నారు.


మొత్తానికి వెండితెర, బుల్లితెరలకు ప్రస్తుతం కొంచెం దూరంగా ఉంటున్న నాగబాబు కొత్త అవతారంలో కనిపిస్తున్నారు. బారు మీసాలు, తెల్లటి గడ్డం,మొఖంలో ఇది వరకు లేని మెరుపుతో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు నాగబాబు. తన కొత్త లుక్కు క్రెడిట్ ను మేకప్ మాన్ నాగశ్రీను కిచ్చేసారు. నాగబాబు కొత్త గెటప్ కి జనాల నుండి మంచి స్పందన వస్తుంది.  కొంచెం బరువు కూడా తగ్గినట్లు కనిపిస్తున్న నాగబాబు న్యూ లుక్కి కారణమేంటో వెతికే పనిలో ఉన్నారు సినీ ప్రియులు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa