ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సందీప్ కిషన్ 'మైఖేల్' సినిమాలో వరుణ్ సందేశ్

cinema |  Suryaa Desk  | Published : Sat, Mar 12, 2022, 12:52 PM

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్,మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి తో సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిన విషయమే.రంజిత్ జయకోడి దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమాకి ‘మైఖేల్’ అనే టైటిల్ ని మేకర్స్ లాక్ చేసారు. సందీప్ కిషన్ సరసన ఈ సినిమాలో దివ్యాన్షా కౌశిక్ హీరోయిన్ గా నటిస్తోందని మేకర్స్ ప్రకటించారు.ఈ మూవీలో వరలక్ష్మిశరత్‌కుమార్ కీలక పాత్రలో కనిపించనుండగా,స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ విలన్ గా నటిస్తున్నారు.తాజాగా ఈ టీమ్‌లోకి వరుణ్ సందేశ్ కూడా వచ్చారు అని మేకర్స్ వెల్లడించారు.'మైఖేల్' సినిమా కొత్త షూటింగ్ షెడ్యూల్ ఈరోజు నుండి హైదరాబాద్‌లో ప్రారంభమైంది అని సమాచారం.తెలుగు,తమిళం,కన్నడ,మలయాళం,హిందీ భాషల్లో ఈ హై బడ్జెట్ సినిమా విడుదల కానుంది.భరత్ చౌదరి, పుస్కూర్ రామ్ మోహన్ రావు ఈ సినిమాని నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa