ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అడివి శేష్ 'మేజర్' అప్డేట్

cinema |  Suryaa Desk  | Published : Sat, Mar 12, 2022, 12:49 PM

టాలెంటెడ్ హీరో అడివి శేష్ తన రాబోయే పాన్ ఇండియన్ మూవీ 'మేజర్'తో సినీ ప్రేమికులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాడు.శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహిస్తున 'మేజర్' చిత్రం 2022 మే 27న ప్రపంచవ్యాప్తంగా చాలా గ్రాండ్‌గా విడుదల కానుంది.సినిమా టీమ్ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసాయి.'మేజర్' చిత్రం భారతదేశంలోని ముంబైలో 26-11 మధ్య జరిగిన ఘోరమైన ఉగ్రవాద దాడులలో వీరమరణం పొందిన సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత ప్రయాణం ఆధారంగా రూపొందించబడింది. శోభితా ధూళిపాళ,సాయి మంజ్రేకర్,ప్రకాష్ రాజ్,రేవతి సహాయక పాత్రల్లో కనిపించనున్నారు.తాజాగా ఈ స్టార్ హీరో ట్విట్టర్‌లో మార్చి 15,2022న కొత్త అప్డేట్ ఇస్తున్నట్లు ప్రకటించారు.'మార్చి 15 మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పుట్టినరోజు.లెజెండ్ జన్మదినోత్సవం సందర్భంగా,మేము స్పెషల్ గా ఒకటి ప్లాన్ చేసాము:)' అని ట్వీట్ చేసారు.ఈ సినిమాకి GMB ఎంటర్టైన్మెంట్స్,సోనీ పిక్చర్స్ ఇండియా మరియు AplusS మూవీస్ బ్యానర్లు నిర్మిస్తున్నారు.తెలుగు,హిందీ,మలయాళం భాషల్లో కూడా విడుదల కానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa