సెన్సషనల్ డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అండ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న 'RRR' సినిమా ఈ నెల 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.ఈ హై బడ్జెట్ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌పై మేకర్స్ దృష్టి సారించారు.ఈ నెల 19న గ్రాండ్ గా జరగనున్న ప్రీరిలీజ్ ఈవెంట్ కి రంగం సిద్దమైంది.బెంగళూరులోని చిక్కబల్లాపూర్‌లో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది.ఆంధ్రప్రదేశ్-కర్ణాటక సరిహద్దులో ఈ ఈవెంట్ ని మేకర్స్ నిర్వహిస్తున్నారు.ఈ భారీ బడ్జెట్ మూవీలో అలియా భట్,సముద్రఖని,అజయ్ దేవగన్,శ్రియా శరణ్,ఒలివియా మోరిస్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.MM కీరవాణి ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.హిందీ,తమిళం,మలయాళం అండ్ కన్నడ భాషలలో కూడా ఈ సినిమా విడుదల కానుంది.డివివి ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డివివి దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa