ఆచార్య సినిమాపై చిరంజీవి అభిమానుల్లో ఎంతో ఉత్కంఠ నెలకొంది. చిరంజీవి .. చరణ్ కథానాయకులుగా కొరటాల 'ఆచార్య' సినిమా రూపొందింది. చిరంజీవి సరసన నాయికగా కాజల్ నటించగా, చరణ్ జోడీగా పూజ హెగ్డే కనువిందు చేయనుంది. చరణ్ - నిరంజన్ రెడ్డి ఈ సినిమాకి నిర్మాతలుగా ఉన్నారు. ఏప్రిల్ 29వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.దేవాలయ భూముల విషయంలో అవినీతికి పాల్పడుతున్న అవినీతిపరుల భరతం పట్టే నక్సలైట్లుగా ఈ సినిమాలో చిరంజీవి - చరణ్ కనిపించనున్నారు. ఈ సినిమా నిడివి 3 గంటలకి పైగా వచ్చిందట. 3 గంటల నిడివి ఓకేనా? బోర్ అనిపిస్తుందా? అనే విషయంలో చిరూ - కొరటాల తర్జనభర్జనలు పడుతున్నారని సమాచారం. ఓ పావుగంట నిడివిని తగ్గిస్తే ఎలా ఉంటుందా అనే విషయం ఇద్దరి మధ్య నలుగుతుందని అంటున్నారు. త్వరలోనే ఈ విషయంలో ఒక నిర్ణయానికి రానున్నారని తెలుస్తోంది. మణిశర్మ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో, సోనూసూద్ .. సంగీత .. పోసాని .. వెన్నెల కిశోర్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనుండగా, స్పెషల్ సాంగ్ లో రెజీనా మెరవనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa