రాథేశ్యామ్ ఎంతో భారీ అంచనాలతో వచ్చినా దాని వసూళ్లపై ఇపుడు అందరి చర్చ సాగుతోంది. ప్రభాస్ నుంచి ఇంతకుముందు వచ్చిన 'బాహుబలి' .. 'బాహుబలి 2' సినిమాల్లో రొమాన్స్ పాళ్లు తక్కువ. ఆ తరువాత వచ్చిన 'సాహో'లో కూడా యాక్షన్ పాళ్లే ఎక్కువ. ఆయన నుంచి యాక్షన్ లేని సినిమాలను ఎవరూ ఊహించరు. కానీ అలాంటి ఒక రొమాంటిక్ కథతో 'రాధేశ్యామ్'గా ఆయన ఈ నెల 11వ తేదీన థియేటర్లకు వచ్చాడు. ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో విడుదలైన ఈ సినిమా, తొలిరోజునే 79 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా వీకెండ్ పూర్తయ్యేనాటికి ఏ స్థాయి వసూళ్లను సాధిస్తుందా అని అంతా ఆసక్తితో ఉన్నారు. తొలి మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 151 కోట్ల గ్రాస్ ను రాబట్టింది. ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడిస్తూ ఒక పోస్టర్ ను వదిలారు. అయితే ఇక ఈ రోజు నుంచి ఈ సినిమా వసూళ్లు ఎలా ఉంటాయనేది చూడాలి. 'ఆర్ ఆర్ ఆర్' బరిలోకి దిగే వరకూ పెద్ద సినిమాలేవీ వచ్చే అవకాశం లేకపోవడం ఈ సినిమాకి కలిసొచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. ప్రభాస్ కి గల క్రేజ్ కి బలమైన కథాకథనాలు తోడై ఉంటే వసూళ్ల పరంగా ఈ సినిమా మరో లెవెల్లో ఉండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa