మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ రాబోయే ప్రాజెక్ట్స్ లో ఒకటైన 'ఘని' మూవీ త్వరలో రిలీజ్ కి సిద్ధంగా ఉంది.కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో స్పోర్ట్స్ డ్రామా ట్రాక్ లో వస్తునా ఈ సినిమాలో వరుణ్ సరసన సాయి మంజ్రేకర నటిస్తోంది.సీనియర్ నటులు ఉపేంద్ర,సునీల్ శెట్టి, జగపతి బాబు,నదియా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు.సినిమా టీజర్ భారీ ఇంపాక్ట్ క్రియేట్ చేసి సినిమాపై అంచనాలను పెంచిందని చెప్పొచ్చు.లేటెస్ట్ అప్డేట్ ప్రకారం,మార్చి 17న ఉదయం 10:30గంటలకు ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్టు ఈరోజు ఉదయం 'ఘనీ' మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.రెనైసన్స్ పిక్చర్స్ అండ్ అల్లు బాబీ కంపెనీ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.థమన్ ఎస్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa