సెన్సషనల్ డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్ లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అండ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న 'RRR' సినిమాలో అలియా భట్,సముద్రఖని,అజయ్ దేవగన్,శ్రియా శరణ్,ఒలివియా మోరిస్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.MM కీరవాణి ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.మాగ్నమ్ ఓపస్ 'RRR' USA మార్కెట్‌లో అసాధారణమైన ప్రీ-సేల్స్ నమోదు చేస్తోంది.లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం,ఈ సినిమా ప్రీ-సేల్స్ $1.50 మిలియన్ మార్క్‌ను క్రాస్ చేసినట్లుగా సమాచారం.ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యాక్షన్-ప్యాక్డ్ ఎంటర్‌టైనర్ తదుపరి టార్గెట్ $2మిలియన్ మార్క్ దిశగా ముందుకు సాగుతోంది.ఈ హై బడ్జెట్ సినిమా ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.డివివి ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డివివి దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa