జ్యోతిష్యానికి అద్భుతమైన ప్రేమకథను జోడించి తీసిన సినిమా రాధేశ్యామ్. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. భారీ బడ్జెట్ తో మార్చి 11న విడుదలైన ఈ సినిమా విజువల్ వండర్ గా నిలిచిందని ప్రేక్షకులు అంటున్నారు. సినిమా కూడా వినోదాత్మకంగా సాగుతుంది. తాజా రాధేశ్యామ్ OTT ప్రసారం చర్చలో ఉంది. ఈ చిత్రం డిజిటల్ హక్కులను ప్రముఖ OTT కంపెనీ అమెజాన్ ప్రైమ్ భారీ ధరకు సొంతం చేసుకుంది. సినిమా విడుదలైన 4 వారాల్లో ఓటీటీలో విడుదల చేసేందుకు అగ్రిమెంట్ జరిగినట్లు సమాచారం. అలా అయితే, ఇది ఏప్రిల్ 11న అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారం కావాలి. అయితే ఉగాది సందర్భంగా ఏప్రిల్ 2న దీన్ని ప్రారంభించేందుకు అమెజాన్ ప్రైమ్ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa