ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆమెతో పడక షేర్ చేసుకున్న: క్రికెటర్

cinema |  Suryaa Desk  | Published : Tue, Mar 15, 2022, 05:00 PM

దేశంలో రియాలిటీ షోలకు ఆదరణ పెరుగుతోంది. బిగ్‌బాస్ షోకు విజయవంతం కావడంతో మరికొన్ని షోలు కూడా పుట్టుకొస్తున్నాయి. ఇటీవల లాకప్ షో పేరిట డిఫరెంట్ కాన్సెప్ట్‌తో మరో రియాలిటీ షో సంచలనం రేకెత్తిస్తోంది. దీనికి బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోంది. తాజాగా ఇందులో ఎలిమినేషన్ రౌండ్‌ నుంచి తప్పించుకునేందుకు హౌస్‌‌లో ఉన్న సభ్యులు తమ జీవితంలో సీక్రెట్‌లను వెల్లడించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో కంటెస్టెంట్‌గా పాల్గొన్న క్రికెటర్ శివమ్ శర్మ ఓ సంచలన విషయం వెల్లడించాడు. తన తల్లి స్నేహితురాలితో బెడ్ షేర్ చేసుకున్నానని చెప్పి, అందరూ అవాక్కయ్యేలా చేశాడు. భర్తతో విడాకులు తీసుకున్న ఆమె తమ ఇంటికి సమీపంలోనే ఉంటుందని చెప్పాడు. తన కాలేజీ రోజుల్లో ఆమె ఇంటికి తరచూ వెళ్లే వాడినని, అలా ఇష్టపూర్వకంగానే తమ మధ్య సంబంధం ఏర్పడిందని పేర్కొన్నాడు. శివమ్ శర్మ 2012లో ఐపీఎల్‌లో పంజాబ్ జట్టుకు ఆడాడు. తాను ఎవరికీ తెలియని సీక్రెట్ వెల్లడించినా అతడు ఎలిమినేట్ అయ్యాడు. ఇక ఈ షో ఇప్పటికే సంచలనాలతో చర్చనీయాంశంగా మారింది. వివాదాస్పద వ్యక్తులు వివాదాస్పద కామెంట్లతో షోకు ప్రజల్లో ఆసక్తి రేకెత్తిస్తున్నారు. ఇందులో పూనమ్ పాండే కూడా పాల్గొని తన జీవితంలో జరిగిన ఎన్నో దురదృష్టకర విషయాలు వెల్లడించింది. ఎంఎక్స్ ప్లేయర్‌లో ప్రసారమవుతున్న ఈ షోకు వీక్షకుల సంఖ్య బాగానే పెరిగిందని తెలుస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa