బాలీవుడ్ నటి ఐశ్వర్యారాయ్ కొన్నాళ్ల క్రితం మితిమీరి గ్లామర్ ఆరబోసి ఒకట్రెండు సినిమాల్లో నటించింది. ఇది ఐష్ అత్త.. జయబచ్చన్ కు అస్సలు నచ్చలేదని బాలీవుడ్ లో టాక్ వినిపించింది. దీనిపై ఐశ్వర్యతో పర్సనల్ గా మాట్లాడి ఆమెను హెచ్చరించినా పద్ధతి మార్చుకోకపోవడంతో జయబచ్చన్ చాలా ఫీలయిందని.. అప్పటి నుంచి వారిద్దరి మధ్య మాటల్లేవని బాలీవుడ్ మీడియాలో కథనాలొచ్చాయి. కానీ ఈ మాటలన్నింటికీ ఐశ్వర్య తాజాగా ఒకే ఒక్క ఫొటోతో చెక్ చెప్పేసింది. అమితాబ్ – జయబాధురిల మ్యారేజ్ యానివర్సరీ సందర్భంగా వాళ్లిద్దరితో కలిసి ఆనందంగా గడిపిన క్షణాలను పంచుకున్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. హ్యాపీ యానివర్సరీ పా అండ్ మా అంటూ అత్తమామలను అమ్మానాన్నలుగా సంబోధిస్తూ వాళ్లను విషెస్ చెప్పి తమ మధ్య ఎంత మంచి అనుబంధం ఉందో తెలిసేలా స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa