ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రజనీ వచ్చాడు.. ఏమైనా మారుతుందా?

cinema |   | Published : Tue, Jun 05, 2018, 09:32 AM

సూపర్ స్టార్ రజనీ కాంత్ సినిమా వస్తోందంటే విడుదలకు ముందు ఆ హంగామా ఎలా ఉంటుందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఆయన ఏ దర్శకుడితో పని చేసినా.. ఎలాంటి సినిమా చేసినా.. ఆటోమేటిగ్గా హైప్ క్రియేట్ అవుతుంది. రజనీ సినిమాకు బుకింగ్స్ ఓపెన్ చేస్తే మోత మోగిపోతుంది. కానీ సూపర్ స్టార్ కొత్త సినిమా ‘కాలా’ విషయంలో మాత్రం దీనికి భిన్నమైన దృశ్యం కనిపిస్తోంది. ఇంతకుముందు రజనీ-పా.రంజిత్ కలిసి చేసిన‘కబాలి’ తీవ్ర నిరాశకు గురిచేయడం వల్లో ఏమో.. ఆ ప్రభావమంతా కాలా మీద పడ్డట్లుంది. దీనికి ముందు నుంచి బజ్ లేదు. అనుకున్న స్థాయిలో బిజినెస్ జరగలేదు. అడ్వాన్స్ బుకింగ్స్ మూడు రోజుల ముందే మొదలు కాగా.. స్పందన అంతంతమాత్రంగా ఉంది. ఎన్నడూ లేని విధంగా థియేటర్లు ఖాళీగానే కనిపిస్తున్నాయి. దీంతో ఈ సినిమా మీద జనాలకు ఆసక్తి లేదా.. లేక రజనీ ప్రభ తగ్గిందా అన్న సందేహాలు కలుగుతున్నాయి.


తెలుగులో పరిస్థితి రజనీకి అర్థమైందో ఏమో.. తన సినిమాను ప్రమోట్ చేయడానికి డిసైడయ్యాడు. అరుదుగా మాత్రమే హైదరాబాద్ వచ్చి తన  సినిమాల్ని ప్రమోట్ చేసే రజనీ.. ‘కాలా’ ప్రి రిలీజ్ ఈవెంట్ కు హాజరయ్యాడు. సోమవారం రాత్రి ఈ ఈవెంట్ కొంచెం భారీగానే చేశారు. రజనీ కూడా చాలాసేపు మాట్లాడాడు. ఈ ఈవెంట్ తో కాలా గురించి మీడియాలో కొంత చర్చ నడిచింది. మరి రజనీ రంగంలోకి దిగాకైనా పరిస్థితి మారుతుంది. ఈ సినిమా జనాల్ని ఆకర్షిస్తుందా.. బుకింగ్స్ ఊపందుకుని.. ‘కాలా’ కు మంచి ఓపెనింగ్స్ వస్తాయా అన్నది చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa