ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'RRR' టీమ్ ని ఇంటర్వ్యూ చేసిన అనిల్ రావిపూడి

cinema |  Suryaa Desk  | Published : Wed, Mar 16, 2022, 04:22 PM

సెన్సషనల్ డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్ లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అండ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న 'RRR' సినిమా ఈ నెల 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.తాజాగా దర్శకుడు అనిల్ రావిపూడి రాజమౌళి,ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్‌లను ఇంటర్వ్యూ చేశారు.ఈ ఇంటర్వ్యూ చూడటానికి ఫుల్ ఫన్ ప్యాకెడ్ ఎంటర్టైనర్ ల ఉంది అని చెప్పొచ్చు.మొత్తం ఇంటర్వ్యూలో తారక్ డామినేట్ చేశాడు.రాజమౌళి అంకితభావం,క్రమశిక్షణ తమను ఎలా ఒత్తిడికి గురి చేశాయో ఎన్టీఆర్ వివరించడం ఈ ఇంటర్వ్యూలో హైలైట్‌గా నిలిచింది.రాజమౌళి ఎక్స్‌ప్రెస్‌ని కూడా ఇమిటేట్ చేసి చూపించారు జూనియర్ ఎన్టీఆర్.ఈ భారీ బడ్జెట్ మూవీలో అలియా భట్,సముద్రఖని,అజయ్ దేవగన్,శ్రియా శరణ్,ఒలివియా మోరిస్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.MM కీరవాణి ఈ  చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.హిందీ,తమిళం,మలయాళం అండ్ కన్నడ భాషలలో కూడా ఈ సినిమా విడుదల కానుంది. డివివి ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డివివి దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa