ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఎక్కడ నిర్వహిస్తారనే ఉత్కంఠకు చిత్ర బృందం తెరదించింది. మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదలయ్యే ఈ సినిమాకు భారీగా ప్రమోషన్లను ఇప్పటికే ప్రారంభించారు. దర్శకుడు రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ ముగ్గురూ వరుస ఇంటర్వ్యూలతో బిజీబిజీగా ఉన్నారు. ఈ క్రమంలో కర్నాటకలో ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను భారీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మార్చి 19న కర్ణాటకలోని చిక్కబల్లాపురలో సాయంత్రం 6 గంటలకు ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నట్లు చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. అయితే ఈ వేడుకకు ముఖ్యఅతిథులుగా కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, కన్నట స్టార్ నటుడ శివరాజ్ కుమార్ చీఫ్ గెస్టులుగా హాజరు కానున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమా కన్నడ, తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లు ఇప్పటి వరకు జరగలేదు. తమిళం, మలయాళం, హిందీ భాషల ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లను మాత్రం ఇప్పటికే నిర్వహించారు.