హిందీలో కంగనా రనౌత్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న లాకప్ షో పలు వివాదాలకు కేంద్రంగా మారుతోంది. వినూత్న కాన్సెప్ట్‌తో నడుస్తున్న ఈ రియాలిటీ షోలో కంటెస్టెంట్లు సంచలన విషయాలను వెల్లడిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ నటి సారా ఖాన్ తన జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందులను బయటపెట్టింది. తన మాజీ భర్త అలీ మర్చంట్‌తో కొన్నేళ్లు డేటింగ్‌లో ఉన్నానని, బిగ్‌బాస్ 2010లో పెళ్లి చేసుకున్నామని తెలిపింది. అతడికి లోనావాలాలో ఓ స్పా ఉండేదని, అక్కడ పనిచేసే అమ్మాయితో అతడు సంబంధం పెట్టుకున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. అతడు మారతాడని ఆశించినట్లు పేర్కొంది. మూడున్నరేళ్లలో కనీసం 300 సార్లు అయినా అతడిని క్షమించినట్లు వెల్లడించింది. అయినప్పటికీ ఏ మార్పూ లేకపోవడంతో విడాకులు తీసుకున్నట్ల తెలిపింది. విడాకులు తనను క్రుంగదీశాయని, కోలుకోవడానికి నాలుగేళ్లకు పైగా సమయం పట్టించిందని వివరించింది.