జాతిరత్నాలు సినిమాతో నవ్వులు పూయించిన డైరెక్టర్ కేవీ అనుదీప్ లక్కీ ఛాన్స్ కొట్టేశాడని సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది. 2016లో వచ్చిన పిట్టగోడ ఆయన మొదటి చిత్రం. ఇక రెండో సినిమా జాతిరత్నాలు ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తింది. ఈ చిత్రం మంచి విజయం సాధించడంతో డైరెక్టర్ అనుదీప్‌పై అందరి దృష్టి పడింది. ఆ సినిమా తర్వాత శివకార్తికేయన్ హీరోగా అనుదీప్ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇది ముగిసిన తరువాత మరో ప్రాజెక్టుపై ఆయన దృష్టిసారించాడు. ఎఫ్2తో నవ్వులు పూయించి త్వరలో ఎఫ్3గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న వెంకటేష్‌తో అనుదీప్ ఓ సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. అనుదీప్ చెప్పి స్క్రిప్ట్‌కు వెంకటేష్ ఓకే చెప్పాడని, త్వరలో వీరిద్దరి కలయికలో సినిమా పట్టాలెక్కుతుందని సమాచారం. ఇద్దరూ కలిసి వెండితెరపై ఎలా నవ్వులు పూయిస్తారో చూడాలి.