ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్టేజ్ పై తారక్‌ని ఆటపట్టించిన అమీర్ ఖాన్

cinema |  Suryaa Desk  | Published : Mon, Mar 21, 2022, 12:49 PM

SSరాజమౌళి డైరెక్షన్ లో జూనియర్ ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ నటిస్తున్న 'RRR' సినిమా కోసం చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ నెల 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సినిమా ప్రస్తుతం ప్రమోషన్స్‌ను శరవేగంగా జరుపుకుంటుంది.తాజాగా ఈ  సినిమా ప్రమోషన్ కోసం రాజమౌళి,తారక్,చరణ్ న్యూఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే.ఈ ఈవెంట్ కి  బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు.స్టేజ్ పై తారక్ మాట్లాడుతుండగా ఓ సరదా సంఘటన జరిగింది.ఒక ఇంటర్వ్యూ లో తారక్ మాట్లాడుతున్నప్పుడు రాజమౌళి అండ్ చరణ్ అతనిని సరదాగా గిల్లిన విషయం తెలిసందే.ఇప్పుడు అమీర్ ఖాన్ కూడా తారక్‌ని మాట్లాడుతున్నపుడు గిల్లాడు.దీంతో ప్రేక్షకులు పగలబడి నవ్వారు.ఈ ఈవెంట్ చాలా వైభవంగా జరిగింది.ఈ భారీ బడ్జెట్ మూవీలో అలియా భట్,సముద్రఖని,అజయ్ దేవగన్,శ్రియా శరణ్,ఒలివియా మోరిస్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. MM కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు.హిందీ,తమిళం,మలయాళం అండ్ కన్నడ భాషలలో కూడా ఈ సినిమా విడుదల కానుంది.డివివి ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డివివి దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa