పవన్ కళ్యాణ్‌తో పాటు దగ్గుబాటి రానాతో కలిసి మల్టీ స్టారర్‌లో నటించిన భీమ్లా నాయక్ OTT విడుదలకు సిద్ధంగా ఉంది. వాస్తవానికి ఈ చిత్రాన్ని ఈ నెల 25న OTTలో విడుదల చేయాలని భావించారు. అయితే తాజాగా ఈ సినిమా విడుదల తేదీని మార్చారు. "భీమ్లా నాయక్" చిత్రాన్ని ఒకరోజు ముందుగా ఈ నెల 24న విడుదల చేయాలని చిత్ర బృందం నిర్ణయించింది. ఆర్ఆర్ఆర్ సినిమా ఈ నెల 25న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 24న "భీమ్లా నాయక్" చిత్రాన్ని విడుదల చేయాలని చిత్ర బృందం నిర్ణయించినట్లు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa