ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీయార్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న చిత్రం ఆర్ ఆర్ ఆర్. ఆలియా భట్, అజయ్ దేవగణ్, శ్రియా శరణ్, ఒలీవియా మోరిస్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం మరికొన్ని గంటల్లోనే థియేటర్లలో ప్రదర్శింపబడనుంది.
ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, గోండు బెబ్బులి కొమురం భీమ్ గా జూనియర్ ఎన్టీయార్ నటిస్తున్న విషయం తెలిసిందే. సినిమాలో ఈ పాత్రలు రెండు ప్రాణ స్నేహితులు. అయితే ముందుగా ఈ పాత్రలకు వారిని అనుకోలేదని చెప్పి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసారు ఈ చిత్ర రచయిత విజయేంద్ర ప్రసాద్.
ఆర్ ఆర్ ఆర్ ప్రొమోషన్స్ లో భాగంగా ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని బయట పెట్టారు విజయేంద్ర ప్రసాద్. మాములుగా అయితే కథ రాసుకునేముందే హీరోని ఫైనలైజ్ చేసుకుని దానికి తగ్గట్టుగా కధలో ఎలివేషన్స్ ఇస్తారు. కానీ ఆర్ ఆర్ ఆర్ కథ రాసుకునేటప్పుడు మాత్రం ఏ హీరోలను అనుకోలేదు. తర్వాత రజినీకాంత్-అర్జున్, సూర్య-కార్తీ ఇలా చాలా కాంబినేషన్స్ అనుకున్నా తారక్-చరణ్ దగ్గర ఆగిపోవాల్సి వచ్చింది. ఎందుకంటే వీరిద్దరూ నిజ జీవితంలో కూడా మంచి స్నేహితులు. వీరిద్దరి ఆఫ్ స్క్రీన్ ఫ్రెండ్షిప్ ఆన్ స్క్రీన్ మీద బాగా ఎస్టాబ్లిష్ అవుతుందని తారక్-చరణ్ లను ఫైనలైజ్ చేసాము అని చెప్పుకొచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa