పుష్ప సీక్వెల్ రెండోదే కాదు మూడోది ఉండనున్నదటా. ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలలో 'పుష్ప' సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. బన్నీ - రష్మిక జంటగా నటించిన ఈ సినిమాకి సుకుమార్ దర్శకత్వం వహించాడు. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాను దేవిశ్రీ ప్రసాద్ మ్యూజికల్ హిట్ గా నిలబెట్టాడు. ప్రస్తుతం ఈ సినిమా టీమ్ సెకండ్ పార్టుకు సంబంధించిన కథా చర్చలు చేయడానికి తమిళనాడులోని 'కూనూర్' వెళ్లిందట. అక్కడి నుంచి పూర్తి స్క్రిప్ట్ తోనే తిరిగి వస్తారట. జూన్ లో గానీ .. జులైలోగాని ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టాలనే ఆలోచనలో ఉన్నారట. ఇక కొత్తగా వినిపిస్తున్న వార్త ఏమిటంటే, ఈ సినిమాకి 3వ పార్టు కూడా చేయాలనే ఆలోచనతో సుకుమార్ ఉన్నాడని అంటున్నారు. ఆ దిశగానే సెకండ్ పార్టును తీసుకు వెళ్లనున్నారని చెబుతున్నారు. సెకండ్ పార్టు తరువాత మధ్యలో కొంత గ్యాప్ తీసుకున్న తర్వాత 'పుష్ప 3' చేస్తారట. మొత్తానికైతే చేయడం మాత్రం ఖాయమన్నమాట!
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa