ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మీకు హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేం: దర్శకుడు శంకర్

cinema |  Suryaa Desk  | Published : Sat, Mar 26, 2022, 02:17 PM

రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన 'ఆర్ ఆర్ ఆర్' నిన్ననే థియేటర్లకు వచ్చింది. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమా, తొలి ఆటతోనే హిట్ టాక్ తెచ్చుకుంది. ఎన్టీఆర్ .. చరణ్ పాత్రలను రాజమౌళి డిజైన్ చేసిన తీరును ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు. ఈ సినిమా చూసిన స్టార్ డైరెక్టర్లు అంతా కూడా రాజమౌళిని తమదైన శైలిలో అభినందిస్తున్నారు.  ఈ కోవలో తమిళ దర్శకుడు శంకర్ స్పందిస్తూ .. "మీ ఊహా శక్తి అతీతమైనది .. మీకు హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేం.  ఎన్టీఆర్ - చరణ్ ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ ఎప్పటికీ నిలిచిపోతుంది. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు" అని పేర్కొంటూ, 'మహారాజ' మౌళి అంటూ ఆయనను సంబోధించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa