దేశ, విదేశాల్లో ఆర్ఆర్ఆర్ సినిమా రికార్డులను తిరగరాస్తోంది. నిన్న విడుదలైన ఆర్ఆర్ఆర్ సినిమా రికార్డుల సునామీని ప్రారంభించింది. ఆస్ట్రేలియాలో ఈ నెల తొలివారంలో విడుదలైన 'ది బ్యాట్‌మన్' సినిమా రికార్డులను తొలి రోజు 'ఆర్ఆర్ఆర్' బద్దలు కొట్టింది. తొలి రోజు పరంగా వసూళ్ల విషయంలో 'ఆర్ఆర్ఆర్' నంబర్ 1 స్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియాలో రూ.4.03 కోట్ల వసూళ్లు రాబట్టగా, న్యూజిలాండ్‌లో రూ.37.07 లక్షలు రాబట్టింది. ఇక అమెరికాలో ఇప్పటివరకు 5 మిలియన్ డాలర్ల వసూళ్లు వచ్చాయి. ఈ విషయాలను వివరిస్తూ బాలీవుడ్ సినీ విమర్శకుడు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa