నితిన్ నట్టించిన మాచర్ల నియోజకవర్గం చిత్రం నుంచి ఫస్ట్ లుక్ వచ్చేసింది. నితిన్ 'భీష్మ' హిట్ తరువాత మూడు సినిమాలు చేశాడు. ఈ మూడు సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర ఆయనకి నిరాశను కలిగించాయి. దాంతో ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఆయన ఉన్నాడు. తన సొంత బ్యానర్ పై నిర్మితమవుతున్న 'మాచర్ల నియోజకవర్గం' సినిమాకి రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి నితిన్ ఫస్టులుక్ ను రిలీజ్ చేశారు. డిఫరెంట్ లుక్ తో ఈ పోస్టర్లో నితిన్ కనిపిస్తున్నాడు. ఆయన పాత్ర ఎమోషన్ తో కూడిన యాక్షన్ తో నడుస్తుందనే విషయం ఈ పోస్టర్ చూడగానే అర్థమైపోతుంది. ఆయన లుక్స్ లో దేనికైనా రెడీ అనే ఓ తెగింపు కనిపిస్తోంది. గ్రామీణ నేపథ్యంలో నడిచే కుటిల రాజకీయాల నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. అవినీతి రాజకీయాలకు అడ్డుకట్టవేసే యువకుడి పాత్రలో నితిన్ కనిపించనున్నాడు. మహతి స్వరసాగర్ సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ సినిమాలో, నితిన్ సరసన నాయికలుగా కృతి శెట్టి - కేథరిన్ అలరించనున్నారు. త్వరలోనే ఈ సినిమా నుంచి రిలీజ్ డేట్ ప్రకటన రానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa