ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'విక్రమ్'పై భారీ అంచనాలు పెంచేస్తున్న కమల్ హాసన్

cinema |  Suryaa Desk  | Published : Sat, Mar 26, 2022, 02:13 PM

తన వైవిద్య నటనతో  'విక్రమ్' చిత్రంపై విడుదలకు ముందే కమల్ హాసన్ ఆ చిత్రంపై భారీ అంచనాలు పెంచేస్తున్నాడు. కమలహాసన్ కథానాయకుడిగా ఆయన సొంత బ్యానర్లో 'విక్రమ్' సినిమా రూపొందుతోంది. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి అనిరుధ్ సంగీతాన్ని సమకూర్చాడు. ఈ సినిమాలో విజయ్ సేతుపతి  .. ఫహాద్ ఫాజిల్ .. నరేన్ ముఖ్యమైన పాత్రలను పోషించారు.  అయితే ఇప్పటివరకూ ఈ సినిమా టీమ్ సస్పెన్స్ లో ఉంచిన ఒక విషయం తాజాగా బయటికి వచ్చింది. ఈ సినిమాలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ ఒక కీలకమైన పాత్రలో కనిపించనున్నాడని అంటున్నారు. సెకండాఫ్ లో ఆయన పాత్ర ఎంట్రీ ఉంటుందని చెబుతున్నారు. ఇంతవరకూ కమల్ ఎన్నో ప్రయోగాలు చేస్తూ వచ్చారు. ఆ జాబితాలో ఈ సినిమా చేరుతుందని అంటున్నారు. జూన్ 3 వ తేదీన తమిళంతో పాటు  తెలుగు .. మలయాళ .. కన్నడ ..  హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమాతో కమల్ మరోసారి భారీ హిట్ అందుకుంటారేమో చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa