సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప'.. సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. బలమైన కథాంశం.. విభిన్న తరహా పాత్రలు.. పాటలు ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా ‘ఊ అంటావా’ పాటలో సమంత సందడి అంతా ఇంతా కాదు. ఎక్కడ చూసినా ఆ పాట జోరుగా సాగుతోంది.
ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ తీసే పనిలో ఉన్నారు. ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయి. జూన్ ... జూలైలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని అంటున్నారు. దిశా పటానీ ఈసారి సినిమాలో ఐటెం భామగా కనిపించనుందని టాక్. యూత్ లో విపరీతమైన క్రేజ్ ఉన్న భామనే రంగంలోకి దింపుతున్నారు.
అయితే ఈ సినిమాలో కూడా సమంత సందడి చేయనుందని టాక్ బలంగా వినిపిస్తోంది. విలక్షణమైన పాత్రలో ఆమె ఒదిగిపోయిందని అంటున్నారు. సుకుమార్ తన ఫేవరెట్ స్టార్ సమంత అని చాలా వేదికలపై చెప్పిన సంగతి తెలిసిందే. ఆ అభిమానంతోనే ఆమె కోసం ఓ స్పెషల్ క్యారెక్టర్ డిజైన్ చేశారట. మరి ఇందులో నిజమెంత అనేది చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa