పెళ్లి సందD సినిమాతో హీరోయిన్‌గా శ్రీలీల తెలుగు తెరకు పరిచయమైంది. ఈ మూవీలో శ్రీలీల నటనకు మంచి పేరు వచ్చింది. తెలుగులో మంచి అవకాశాలు వస్తుండటంతో.. శ్రీలీల తన రెమ్యునరేషన్‌ను ఏకంగా రూ.కోటికి పెంచిందని తెలిసింది. ప్రస్తుతం రవితేజ ధమాకాతో పాటు నవీన్ పొలిశెట్టికి జోడీగా ఓ మూవీలో నటిస్తోంది. కన్నడలో గాలి జనార్ధన్ రెడ్డి తనయుడు కిరీటి హీరోగా వస్తున్న మూవీ కోసం శ్రీలీలకు కోటిన్నర రెమ్యునరేషన్ ఇస్తున్నారట.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa