ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపు “కృష్ణ వ్రింద విహారి” టీజర్‌

cinema |  Suryaa Desk  | Published : Sun, Mar 27, 2022, 11:48 AM

డైరెక్టర్‌ అనీష్‌ కృష్ణ దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం “కృష్ణ వ్రింద విహారి”. ఈ చిత్రం ఏప్రిల్ 22న విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. మార్చి 28న టీజర్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కాగా, ఈ చిత్రంలో షిర్లీ సెటియా హీరోయిన్‌గా నటిస్తుండగా, సీనియర్ నటి రాధిక, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, సత్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మహతి స్వరసాగర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa