బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ పోస్ట్ చేసిన 8 ప్యాక్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. షారుఖ్ ఖాన్ తన కొత్త సినిమా కోసం తన శరీరాకృతిని మార్చుకున్నాడు. షారూఖ్ ఖాన్ కొత్త లుక్‌పై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. గతంలో ఆయన 6 ప్యాక్ లుక్‌తో సినిమాలు వచ్చాయి కానీ ఇది 8 ప్యాక్ లుక్.
వెండితెరపై కనిపించి చాలా రోజులైంది. షారుఖ్ ఖాన్ చివరిసారిగా నటించిన చిత్రం ‘జీరో’. ప్రస్తుతం 'పఠాన్' సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 25న విడుదల కానున్న ఈ చిత్రాన్ని యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa