విమల్ కృష్ణ దర్శకత్వంలో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా తెరకెక్కిన చిత్రం డీజే టిల్లు. నేహా శెట్టి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మాజీ, ప్రిన్స్ సెసిల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా థియేటర్లలో విడుదలై సూపర్ హిట్ అయింది. ఈ చిత్రం డిజిటల్ ప్రీమియర్‌గా ప్రదర్శించబడి విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమా ఇప్పుడు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ షోకి సిద్ధమవుతోంది. ఈ చిత్రం వచ్చే ఆదివారం సాయంత్రం 6:30 గంటలకు స్టార్ మాలో ప్రసారం కానుంది. మరి ఈ సినిమాకు బుల్లితెరపై ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. ఈ చిత్రానికి సంగీతం శ్రీ చరణ్ పాకాల మరియు రామ్ మిరియమ్ అందించగా, సంగీత సంచలనం థమన్ నేపథ్య సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa