టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా జనగణమణ సినిమాను పేర్కొనగా, ఆ సినిమాను యువహీరో విజయ్ దేవరకొండతో తెరకెక్కిస్తానని తెలిపిన విషయం తెలిసిందే. మరి ఏమైందో తెలియదు గానీ జనగణమణ టైటిల్ కాకుండా JGM అనే మరో టైటిల్ తో విజయ్ దేవరకొండ-పూరి జగన్నాధ్ ల న్యూ మూవీ ని ఎనౌన్స్ చేసారు. ఆల్రెడీ వీరిద్దరి కాంబినేషన్ లో లైగర్ సినిమా తెరకెక్కుతుంది. పాన్ ఇండియా లెవెల్లో విడుదలవుతున్న లైగర్ విడుదల కాకుండానే మరో కొత్త సినిమాని ఎనౌన్స్ చేసి ప్రేక్షకులతో పాటూ చిత్రసీమని కూడా ఆశ్చర్యపరిచారు పూరి. లైగర్, JGM రెండు కూడా పాన్ ఇండియా సినిమాలు కావటం విశేషం.
తాజాగా విడుదలైన JGM టైటిల్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. గగనతలంలో ఎదురైన విపత్కర పరిస్థితిని ఎదుర్కొనటానికి సిపాయిలు బయలుదేరుతున్న ఆ పోస్టర్ ఇంటరెస్టింగ్ గా ఉంది. JGM మూవీ అనౌన్సమెంట్ కోసం విజయ్ దేవరకొండ హెలికాఫ్టర్ నుండి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. సైనికులతో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చాడు. ఆర్మీ కట్ లో విజయ్ లుక్ అదిరిపోయింది. అయితే ఈ మూవీ విడుదల తేదీని కూడా ప్రకటించేసారు చిత్రబృందం. 2023 ఆగస్టు 23న JGM ను విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. జనగణమణ టైటిల్ తో తమిళ, మలయాళ భాషల్లో కూడా సినిమాలు తెరకెక్కనుండటంతో పూరి తన డ్రీం ప్రాజెక్ట్ కు JGM అని టైటిల్ మార్చి ఉంటారని కొందరనుకుంటున్నారు. ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్లపై వంశీ పైడిపల్లి, ఛార్మికౌర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa