రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా జూబ్లీహిల్స్ జీహెచ్‌ఎంసీ పార్కులో మొక్కలు నాటిన సినీ నటుడు తరుణ్. ఈ సందర్భంగా తరుణ్ మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందన్నారు. పర్యావరణ పరిరక్షణకు శ్రీకారం చుట్టిన ఎంపీ సంతోష్ కుమార్ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఇప్పటి వరకు కోట్లాది మొక్కలు నాటడం గొప్ప విషయం. పచ్చదనం పెంచేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని తరుణ్ కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa