టాలీవుడ్ హీరో సుధీర్ బాబు భవ్య క్రియేషన్స్ నిర్మాణంలో యాక్షన్ థ్రిల్లర్ సినిమా చేస్తున్నట్టు ప్రకటించారు.తాజా అప్డేట్ ప్రకారం, మహేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈరోజు ప్రారంభమైంది.సుధీర్ బాబు ఈరోజు సినిమా సెట్స్‌లో జాయిన్ అవ్వగా కొన్ని ప్రధాన సన్నివేశాలను చిత్రీకరించారు.ఈ సినిమాలో సుధీర్ బాబు ఇంటెన్స్ పోలీస్ పాత్రలో కనిపించనున్నారు అని మేకర్స్ వెల్లడించారు.ఆనంద ప్రసాద్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో భరత్,శ్రీకాంత్,మైమ్ గోపి,‘జెమినీ’ సురేష్,అజయ్ రత్నం తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఈ ప్రాజెక్ట్ కి సంభందించిన మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa