ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'SDT 15' సెట్స్‌లో జాయిన్ అయ్యిన సాయి ధరమ్ తేజ్

cinema |  Suryaa Desk  | Published : Tue, Mar 29, 2022, 07:12 PM

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సాయి ధరమ్ తేజ్ చాలకాలం తరువాత మళ్లీ సెట్స్‌పైకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు.కార్తీక్ దండు డైరెక్షన్ లో తేజ్ మిస్టరీ థ్రిల్లర్ షూటింగ్‌లో జాయిన్ కాబోతున్నాడు అని లేటెస్ట్ టాక్.గతంలో మేకర్స్ ఈ సినిమా ప్రీ లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.అయితే కోవిడ్ అండ్ తేజ్ యాక్సిడెంట్ కారణంగా సినిమా షూటింగ్ జరగలేదు.తాజాగా ఈరోజు తన తదుపరి సినిమా సెట్స్‌లో కనిపించరు.చాలా గ్యాప్ తర్వాత షూటింగ్‌కి వచ్చిన తేజ్ కు మూవీ టీమ్ ఘనస్వాగతం పలికింది.'SDT15' సినిమా ప్రొడ్యూసర్ లో ఒకరైన దర్శకుడు సుకుమార్ ఈ హీరోకి పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు.శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈరోజు ప్రారంభమైంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa