ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయ్ సరసన మహేష్ 'వన్' హీరోయిన్?

cinema |  Suryaa Desk  | Published : Wed, Mar 30, 2022, 12:07 PM

ఇటీవలే బచ్చన్ పాండే సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులను అలరించింది హీరోయిన్ కృతిసనన్. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ హోదాలో ఉన్న కృతి మిగిలిన చిత్రసీమలలో కూడా పాగా వేయాలనుకుంటుంది. ఈ మేరకు ఆమె దృష్టి తమిళ చిత్రసీమవైపు పడింది. కృతి తమిళచిత్ర రంగ ప్రవేశానికి రంగం కూడా సిద్ధమైంది. 


తమిళ స్టార్ హీరో విజయ్ 66వ సినిమాలో హీరోయిన్గా కృతిసనన్ అయితే బాగుంటుందనే ఆలోచనలో వున్నారట ఈ మూవీ దర్శకుడు వంశీ పైడిపల్లి. తమిళంతో పాటు తెలుగులో కూడా రూపొందుతున్న ఈ ద్విభాషా చిత్రంలో హీరోయిన్గా మొదట మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా, క్రేజీ హీరోయిన్ రష్మిక పేర్లు వినబడ్డాయి. ఇప్పుడు కృతిసనన్ పేరు తెరపైకి వచ్చింది. దాదాపు కృతినే ఈ సినిమాలో ఖాయమయ్యేటట్టుందని అనుకుంటున్నారు. ప్రకాష్ రాజ్, వివేక్ ఒబేరాయ్ ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ఏప్రిల్ 2నుండి ప్రారంభం కానుందని సమాచారం. హీరోయిన్ తో పాటు ఈ మూవీ కి సంబంధించిన మిగిలిన వివరాలను కూడా త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారట.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa