ట్రాఫిక్ చలానాలపై విధించిన రాయితీలు మార్చి 31తో ముగియనుండటంతో వాహన తనిఖీలు చేసి పెండింగ్ చలానాలను వసూలు చేస్తున్నారు హైదరాబాద్ పోలీసులు. ఈ క్రమంలో కొంతమంది సెలెబ్రిటీలు, ప్రజాప్రతినిధుల కార్లను సోదాలు చేసి వారి అద్దాలకున్న బ్లాక్ ఫిలింను తొలగించి జరిమానా విధిస్తున్నారు. ఇటీవలే ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్, కళ్యాణ్ రామ్ హీరోల కార్లకున్న బ్లాక్ ఫిలిం ను తొలగించి రూ. 700 ల జరిమానాను కూడా విధించారు.
తాజాగా మరో సినీనటుడు మంచు మనోజ్ కారును కూడా పోలీసులు అడ్డగించారు. ఈ సంఘటన మెహదీపట్నం టోలిచౌకి దగ్గర జరిగింది. అటుగా వెళ్తున్న మంచు మనోజ్ కారును ఆపి సోదాలు నిర్వహించిన పోలీసులు ఆయన కారుకున్న బ్లాక్ ఫిలిం ను తొలగించి 700రూపాయల జరిమానాను విధించారు.
కేవలం Y,Z, Z + క్యాటగిరి వంటి భద్రత ఉన్న వ్యక్తులు మాత్రమే కార్ల అద్దాలకు బ్లాక్ ఫిలిం ను వాడాలి. ఈ మేరకు సుప్రీమ్ కోర్టు తీర్పు కూడా ఇచ్చింది. కానీ నిబంధనలకు విరుద్ధంగా సినీ సెలెబ్రిటీలు బ్లాక్ ఫిలిం ను వాడటం పట్ల పోలీసులు అసంతృప్తితో ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa