ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'గాలివాన'లో పవర్ ఫుల్ రోల్ లో కనిపించనున్న నందిని రాయ్

cinema |  Suryaa Desk  | Published : Wed, Mar 30, 2022, 12:24 PM

భారతదేశంలోని ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్‌లలో ZEE5 ఒకటి.ఈ పాపులర్ OTT ప్లాట్ఫారం తాజాగా 'గాలివాన' అనే టైటిల్ తో ఒక వెబ్ సిరీస్ ని అనౌన్స్ చేసింది.సస్పెన్స్ థ్రిల్లర్‌ ట్రాక్ లో రానున్న ఈ వెబ్ సిరీస్ ని 'తిమ్మరుసు' ఫేమ్ శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించనున్నారు.తాజాగా నటి నందిని రాయ్ ఈ సిరీస్ లో పోషించిన పాత్రను గురించి మేకర్స్ వెల్లడించారు.ఈ సినిమాలో నందిని రాయ్ సీఐ నందిని పాత్రలో కనిపించనుంది.ఈ వెబ్ సిరీస్‌లో సీనియర్ నటి రాధిక శరర్థకుమార్,సాయి కుమార్,చాందిని చౌదరి, చైతన్య కృష్ణ,తాగుబోతు రమేష్,నందిని రాయ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఈ ఒరిజినల్ సిరీస్‌ BBC అండ్ నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తున్నాయి.ఈ సిరీస్ కి శ్రీచరణ్ పాకాల సంగీతం అందించగా,సుజాత సిద్ధార్థ్ సినిమాటోగ్రఫీ అందించారు.ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa